కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఓటీటీలకు ఊహించని స్థాయిలో ఆదరణ పెరుగుతోందనే సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన జీ5లో హెడ్స్ అండ్ టేల్స్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. కలర్ ఫోటో సినిమాకు పని చేసిన కోర్ టీమ్ హెడ్స్ అండ్ టేల్స్ ను రూపొందించగా సునీల్, సుహాస్, శ్రీవిద్య, దివ్య శ్రీపాద, చాందిని రావు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
సినిమాలో అనీషా పాత్రలో శ్రీవిద్య నటించగా అలివేలు మంగ పాత్రలో దివ్య శ్రీపాద శృతి పాత్రలో చాందిని రావు నటించారు. అలివేలు మంగకు భర్తతో సమస్య ఎదురు కాగా అనీషాకు నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో, శృతికి బాయ్ ఫ్రెండ్ తో సమస్య ఎదురవుతుంది. ఈ ముగ్గురు యువతులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఆ సమస్యల నుంచి వాళ్లు బయటపడ్డారా? ఈ ముగ్గురు యువతులకు మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.
సమాజంలో నిత్యం మహిళలు ఎదుర్కొనే సమస్యలను సందీప్ రాజ్ అద్భుతమైన కథగా మలిచారు. సాయికృష్ణ ఎన్రెడ్డి తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు అమ్మాయిలకు మంచి సందేశం ఇచ్చారు. శ్రీవిద్య, దివ్య శ్రీపాద సినిమాలో సహజంగా నటించారు. సునీల్ పాత్ర సినిమాలో ఉండేది కొంత సమయమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీకెండ్ సినిమాను చూడాలని అనుకునే వాళ్లకు హెడ్స్ అండ్ టేల్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.