నిన్న అంటే ఆగస్టు 2న టార్గెట్ చేసి చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘ఉషాపరిణయం’ అనే మూవీ కూడా ఉంది. కానీ ఇది చిన్న సినిమా అనలేం. ఎందుకంటే ‘స్వయంవరం’ ‘నువ్వేకావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్'(Nuvvu Naaku Nachav) ‘మన్మధుడు’ ‘మల్లీశ్వరి'(Malliswari) వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) తెరకెక్కించిన సినిమా ఇది. ఆయన సినిమాల్లో ఎటువంటి వల్గారిటీ లేకుండా హెల్దీ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి.
అంతేకాదు మంచి పాటలు కూడా ఉంటాయి. ‘ఉషాపరిణయం’ టీజర్, ట్రైలర్, పాటలు చూసినప్పుడు కూడా అందరికీ అదే ఆలోచన కలిగింది. అందుకే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. నిన్న చాలా సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉషాపరిణయం’ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని. కామెడీ, సాంగ్స్ అందరికీ నచ్చే విధంగా ఉన్నాయని సినిమా చూసిన వారు చెప్పుకొచ్చారు.
అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. ఓ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ‘ఉషాపరిణయం’ ఆ లోటుని తీర్చింది అని చెప్పాలి. షో…షోకి స్క్రీన్స్ పెంచుతున్నారు. వీకెండ్ కి హ్యాపీగా థియేటర్ కి వెళ్లి.. నవ్వుకుని రావాలంటే ఈ ‘ఉషాపరిణయం’ కి వెళ్లొచ్చని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.