Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమాకు ఆ క్రేజీ సెంటిమెంట్ కలిసొస్తుందా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నా ఆ కామెంట్లు అస్సలు నమ్మేలా లేవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ షూటింగ్స్ తో బిజీ కావడానికి చాలా సమయం పడుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు టీజర్ లో కనిపించిన చార్మినార్ సెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

చార్మినార్ సెట్ లో షూట్ చేసిన ఒక్కడు (Okkadu) మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చార్మినార్ కనిపించిన చాలా సినిమాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ (Krish Jagarlamudi) దర్శకునిగా కొనసాగి ఉంటే బాగుండేదని క్రిష్ స్థాయిలో జ్యోతికృష్ణ (A. M. Jyothi Krishna)  ఈ సినిమాను తెరకెక్కించడం సులువు కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

చిన్నచిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తే ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

భవిష్యత్తు ప్రాజెక్ట్స్ విషయంలో పవన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందో స్పష్టత రావాల్సి ఉంది. పవన్ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ రాజకీయాల్లో సక్సెస్ అయినా సినిమాల్లో కొనసాగాలని అభిమానులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus