నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ (China Piece). మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వపరిచారు.
కాల భైరవ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. తన పదాలని ఆయుధాలుగా మార్చి రెహమాన్ రాసిన లిరిక్స్ అందరినీ హత్తుకున్నాయి.
ఈ చిత్రానికి సురేష్ రగుతు కెమరామ్యాన్. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.
ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పీఆర్వో: తేజస్వీ సజ్జా