బాలయ్యకు బాగా సూటయ్యే టైటిల్ సెట్ చేసిన బోయపాటి..!

బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీలో బాలయ్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు. బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ లో బాలయ్య గెటప్ అదిరిపోయింది. వైట్ అండ్ వైట్ పంచె కట్టులో బాలయ్య రాజసంగా కనిపించారు. బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి కావడంతో పాటు, సినిమా విజయంపై నమ్మకం పెంచుకున్నారు.

మరో పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపించడం విశేషం. కాగా ఈ చిత్ర టైటిల్స్ విషయంలో అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొదట మోనార్క్ అనే టైటిల్ బయటికి రావడం జరిగింది. అలాగే సూపర్ మ్యాన్, మొనగాడు మరియు బొనాంజా అనే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి డేంజర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బాలయ్యతో బోయపాటి చేసిన చిత్రాలకు సింహా, లెజెండ్ అనే పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టడం జరిగింది. కావున ఈ చిత్రానికి కూడా డేంజర్ అనే టైటిల్ పెట్టడం ఖాయం అంటున్నారు. ఇక బోయపాటి ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు.

లాక్ డౌన్ లేని పక్షంలో ఈ ఏడాది చివర్లో లేదా 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూశారు. త్వరోనే షూటింగ్ మొదలుకానుండగా వచ్చే ఏడాదికి విడుదల కానుంది. మిర్యాల రవీంధర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus