అక్కినేని అభిమానులను టెన్షన్ పెడుతున్న చైసామ్..?

చైసామ్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అక్కినేని అభిమానులు మాత్రమే కాదు.. యూత్ లో కూడా వీరికి మంచి క్రేజ్ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ కరోనా సోకిందంటూ గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం.. శిల్పా రెడ్డి అని తెలుస్తుంది. విషయం ఏంటంటే.. సమంతకు శిల్పా రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితం శిల్పారెడ్డి, సమంత లు కలుసుకున్నారు.

ఒకరినొకరు ముద్దులు కూడా పెట్టుకున్నారు. అయితే శిల్పా రెడ్డికి కరోనా ఉందని తేలింది. దాంతో సమంతకు అలాగే తన ద్వారా నాగ చైతన్యకు కూడా కరోనా సోకిందని ప్రచారం నడుస్తుంది. దీంతో అక్కినేని అభిమానుల్లో కూడా టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో కూడా చైతన్య, సమంత లకు కరోనా సోకిందని డిస్కషన్లు మొదలయ్యాయి. అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని.. తాజాగా సమంత, చైతన్య లు కరోనా పరీక్షలు చేయించుకున్నారట.

అయితే వీరికి కరోనా నెగిటివ్ వచ్చిందని సమాచారం. దాంతో అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తుంది. అసలే మొన్నటికి మొన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతని ఇంటి వద్ద ఉంటున్న ఓ యువ హీరో కూడా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోయాడు. దీంతో టాలీవుడ్ కు కూడా కరోనా భయం పట్టుకుందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus