రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కుటుంబం విషయానికి వస్తే మాత్రం ఒక్కసారిగా సింపుల్ స్టైల్ లోకి మారిపోతాడు. నిజానికి ప్రభాస్ వెండితెరపై కనిపించినంత కలర్ఫుల్ గా అయితే రియల్ లైఫ్ లో మాత్రం అస్సలు కనిపించడు. వీలైనంతవరకూ తన స్టార్ హోదాను అస్సలు చూపించకుండా ఉంటాడు. ఫ్యామిలీ తో ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే మాత్రం ప్రభాస్ వారితో సమయాన్ని కేటాయించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు.
ఆ సమయంలో సినిమాకు సంబంధించిన పనులను కూడా పెట్టుకోడు. ఇక రీసెంట్ గా చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫోటోకు స్టిల్ కూడా ఇచ్చాడు. డాటర్స్ డే సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి సోషల్ మీడియాలో ఒక ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉప్పలపాటి కుటుంబ సభ్యులు దాదాపు 50 మందికి పైగానే ఉన్నారు. కృష్ణంరాజు శ్యామల దేవి ఇద్దరు కూడా మనవళ్లు మనవరాళ్లు కొడుకులు కూతుళ్లు అల్లుళ్లతో కలిసి ఒక ఫోటో కు స్టిల్ ఇచ్చారు.
అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ప్రభాస్ కూడా ఆ మధ్యలో కూల్ గా కనిపిస్తూ స్మైల్ ఇచ్చాడు. జగమంత కుటుంబం అని ఒకప్పుడు పాట పాడిన ప్రభాస్ ఈసారి ఫ్యామిలీ ఫోటోతో ఆ పాటను మరోసారి గుర్తు చేశాడు.