Prabhas: స్టార్ హీరో ప్రభాస్ అక్కడ రూ.200 కోట్లతో రోడ్లు వేయిస్తున్నారా?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం క్రేజ్ , రెమ్యునరేషన్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు. అయితే మొగల్తూరులో రూ.200 కోట్ల ఖర్చుతో ప్రభాస్ రోడ్డు వేయిస్తున్నారంటూ ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి ప్రభాస్ లేదా ప్రభాస్ సన్నిహితుల నుంచి క్లారిటీ వస్తే మాత్రమే ఇలాంటి వార్తలను నమ్మాలి. ఈ మధ్య కాలంలో నెట్టింట సెలబ్రిటీల గురించి ఫేక్ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. 200 కోట్ల రూపాయలను రోడ్ల కోసం ఖర్చు చేయడం అంటే ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా సులువైన విషయం కాదు. అందువల్ల ప్రభాస్ స్పందించే వరకు ఈ వార్తలను నమ్మవద్దని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ తను హీరోగా తెరకెక్కిన సినిమాలకు నష్టాలు వచ్చిన సమయంలో చాలా సందర్భాల్లో నిర్మాతలను ఆదుకున్నారు. ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ నుంచి త్వరలో వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki) చెప్పిన తేదీకే విడుదలయ్యే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సమ్మర్ తర్వాత ప్రభాస్ సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను పెంచుకున్న ప్రభాస్ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. ప్రభాస్ మనస్సు మాత్రం మంచి మనస్సు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus