‘ఆదిపురుష్’ని ఫ్రీగా వదిలేస్తారా..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో బాలీవుడ్ లో నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. 2022 ఆగస్టు 11న సినిమా విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఆ సమయానికి బాలీవుడ్ స్టార్లు ప్రభాస్ ని అంత ఫ్రీగా రానిస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలుగులో సంక్రాంతి, దసరా ఎలా అయితే సినిమా బిజినెస్ కి కీలకమో, బాలీవుడ్ లో కూడా అలానే కొన్ని పర్టిక్యులర్ డేట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇండిపెండెన్స్ డే వీకెండ్‍. ఈద్, దీపావళితో పాటు ఇండిపెండెన్స్ డే వీకెండ్‍ పై స్టార్లు కర్చీఫ్ వేస్తుంటారు. ప్రభాస్ ‘సాహో’ సినిమాను ఇండిపెండెన్స్ డే ఫిక్స్ చేసుకున్నప్పుడు చాలా హిందీ సినిమాలు పోటీకి వచ్చాయి. దీంతో ఆ సమయంలో ‘సాహో’ సినిమాను రిలీజ్ చేయలేక రెండు వారాల పాటు వాయిదా వేసుకున్నారు. ‘ఇప్పుడు ఆదిపురుష్’ రిలీజ్ డేట్ కూడా ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి టార్గెట్ చేశారు.

నిజానికి బాలీవుడ్ లో సినిమాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేసి.. దానికి తగ్గట్లుగా వర్క్ ప్లాన్ చేస్తారు. అయితే ఆగస్టు 11న ప్రభాస్ సినిమా విడుదల చేస్తే ఇతర బాలీవుడ్ స్టార్లు ఆ వీకెండ్ ని ప్రభాస్ కి వదిలేస్తారా..? అతడితో పోటీకి వెళ్లకుండా ఉంటారా అనే విషయాలు ఇప్పుడు చెప్పలేం. కానీ సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు పండగ సీజన్లను హైజాక్ చేస్తుంటారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి వాళ్లు కూడా అడ్డుపడే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభాస్ అనుకున్న డేట్ ని ఫ్రీగా ఇచ్చేసే పరిస్థితి ఉండకపోవచ్చు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus