టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రభాస్ ఒకరు. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇకపోతే తాజాగా ప్రభాస్ కి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభాస్ కి ఒక చెడ్డ అలవాటు ఉందని ఆ చెడ్డ అలవాటు కారణంగా ఈయన ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనీ తెలుస్తుంది. ప్రభాస్ ఎవరితోనూ ఏ విధమైనటువంటి విభేదాలకు వెళ్లరు. ఇక సినిమాల షూటింగ్ సమయంలో అందరితోనూ ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇక షూటింగ్ లొకేషన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన విందు భోజనాలన్నింటిని ఏర్పాటు చేస్తూ వారి పట్ల ఎంతో మంచిగా మెలుగుతూ ఉంటారని ఇప్పటికే ప్రభాస్ తో సినిమా చేసిన వారందరూ కూడా ఈ విషయాలను తెలిపారు.
అయితే తాజాగా ప్రభాస్ కి ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు గురించి ఒక వార్త వైరల్ గా మారింది ప్రభాస్ కి మొహమాటం అనే ఒక చెడ్డ అలవాటు ఉందట. ప్రభాస్ గురించి ఎవరైనా తిడుతున్న లేదా చెడుగా మాట్లాడుతున్న కూడా ప్రభాస్ ఏ మాత్రం సీరియస్ గా తీసుకోరట. తన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే తిరిగి ఎదురు సమాధానం చెప్పరట. ఇలా చెప్పకపోవడం వల్ల ఈయన ఎంతోమంది చేత అవమానాలు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.
అయితే (Prabhas) ప్రభాస్ కి ఉన్నటువంటి ఈ మొహమాటం తగ్గించుకోకపోతే ఆయన భవిష్యత్తులో ఇలాంటి అవమానాలను ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏ విషయం గురించి అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేయడం అలవాటు చేసుకోవాలి అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.