మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా రూపొందింది. రవితేజ చాలా గ్యాప్ తర్వాత చేసిన ఫ్యామిలీ మూవీ ఇది. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సంగీతంలో రూపొందిన ‘బెల్లా బెల్లా’ ‘అద్దం ముందు నిలబడి’ ‘వామ్మో వాయ్యో’ వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి.
దీంతో జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.

వారి టాక్ ప్రకారం.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో కొన్ని కామెడీ బ్లాక్స్ బాగా వర్కౌట్ అవ్వడం వల్ల ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందట. కానీ తర్వాత కొంచెం ఓవర్ ది టాప్ అన్నట్టు సాగుతుందట. స్టోరీ లైన్ అయితే చిన్నగానే ఉంటుందట. స్క్రీన్ ప్లే అయితే చాలా సార్లు చూసినట్టే ఉంటుందని అంటున్నారు. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల కొన్ని కామెడీ బ్లాక్స్ ని బాగా రాసుకున్నాడట. వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా అందరికీ నచ్చుతుంది అంటున్నారు.
అందువల్ల ఫస్ట్ హాఫ్ చాలా పాసబుల్ గా అనిపిస్తుందట. అయితే సెకండాఫ్ మాత్రం సాగదీసినట్టు ఉంటుందట. క్లైమాక్స్ కూడా వీక్ అని అంటున్నారు.కానీ సెకండాఫ్ లో కూడా కొన్ని కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాస్ ఆడియన్స్ కి నచ్చుతాయని అంటున్నారు. మొత్తంగా రవితేజ రీసెంట్ సినిమాలతో పోలిస్తే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బెటర్ అని అంటున్నారు. కచ్చితంగా ఒకసారి చూసే విధంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
#BharthaMahasayulakuWignyapthi An Entertainer with a Few Comedy Blocks That Work Out, but Goes Over the Top Elsewhere!
The film has a very thin storyline with a screenplay that has been seen many times. Director Kishore Tirumala manages to deliver a few comedy blocks that work,…
— Venky Reviews (@venkyreviews) January 13, 2026
