Prabhas: ‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకకు అతిధిగా ప్రభాస్..!

‘అనాథ అయిన సైనికుడు లెఫ్టినెంట్ రామ్ కు ప్రేమ అనేది కరువవుతుంది. అతనికి లెటర్ రాయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. ఓ రోజు రేడియోలో ఇతని గురించి చాలా గొప్పగా చెబుతారు.రామ్ గొప్పతనం తెలుసుకున్న సీత అనే అమ్మాయి అతనికి భార్యని అంటూ ఉత్తరం రాస్తుంది’….ఆ తర్వాత ఏమైంది అనే విషయాలను మనం మరో 3 రోజుల్లో తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 5న విడుదల కాబోతుంది ‘సీతా రామం’ చిత్రం.

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో దర్శకుడు తరుణ్ భాస్కర్, రష్మిక మందన నటిస్తున్నారు. ‘సీతా రామం’ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ చాలా బాగున్నాయి.ఇక ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ముహూర్తం ఖరారైంది. అవును రామ్ కోసం రాముడు రాబోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా.. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ గా కనిపించబోతుంటే,

‘ఆదిపురుష్’ లో రాముడిగా కనిపించబోతున్న ప్రభాస్.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడు. ‘సీతా రామం’ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ప్రభాస్ రాబోతున్నాడు. ప్రభాస్ ఇలా ప్రీ రిలీజ్ వేడుకల్లో గెస్ట్ గా కనిపించి చాలా రోజులు అయ్యింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్ ‘సీతా రామం’ కి యాడ్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అనే చెప్పాలి.

‘సీతా రామం’ నిర్మాతలైన అశ్వినీ దత్, స్వప్న దత్ ల తోనే ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేయబోతున్నాడు ప్రభాస్. ఇటీవల కాలికి సర్జెరీ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లిన ప్రభాస్.. ‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకానుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus