Prabhas, Krishnam Raju: ఈశ్వర్ సమయంలో కృష్ణంరాజు అలా అన్నారా?

  • September 12, 2022 / 04:40 PM IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త సాధారణ ఫ్యాన్స్ ను, కృష్ణంరాజు ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఒక సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ కృష్ణంరాజు చెప్పిన విషయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెదనాన్న కృష్ణంరాజు వల్లే తాను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. నా జీవితంలో నేను గొప్పగా నటించినా ఆయన వల్లేనని ప్రభాస్ వెల్లడించారు. నాకు ఏదైనా గొప్ప పేరు వస్తే అందుకు కారణం పెదనాన్నే అని ప్రభాస్ పేర్కొన్నారు.

ఇక నాకు ఏదైనా చెడ్డ పేరు వస్తే మాత్రం అది నాకే చెందుతుందని ప్రభాస్ అన్నారు. కృష్ణంరాజు గారు కుటుంబానికే స్పూర్తి అని ఈశ్వర్ సినిమా షూట్ సమయంలో పెదనాన్న కష్టపడే గుణంతో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యమని చెప్పారని మంచి క్యారెక్టర్ లేకపోతే ఎంత ఎదిగినా వృథా అని పెదనాన్న చెప్పారని ప్రభాస్ తెలిపారు. పెదనాన్న మరణ వార్త తెలిసినప్పటి నుంచి ప్రభాస్ కన్నీటి పర్యవంతమవుతున్నారు. ప్రభాస్ ను అలా చూసి అభిమానులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రభాస్ బాధ పడుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్న ప్రభాస్ ఆ విషయాలను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ప్రభాస్ ఆతిథ్యంకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ ఒకవైపు తన కుటుంబ సభ్యులను ఓదారుస్తూనే చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు. కృష్ణంరాజు మరణంతో కుటుంబానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఆయనపైనే పడనున్నాయని తెలుస్తోంది.

బాహుబలి సినిమాతోతిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ కుటుంబ బాధ్యతలను తీసుకుని కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కష్టం రాకుండా అడుగులు వేయాల్సి ఉంది. ప్రభాస్ కు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. ప్రభాస్ ఈ స్థాయికి ఎదగడంలో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus