బాహుబలి సిరీస్ ప్రభాస్ రేంజ్ మార్చి వేసింది. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య జపాన్ అమ్మాయిలు కొందరు ప్రభాస్ ఇంటి ముందు డాన్సులు చేశారు. ప్రభాస్ వారిని కలిసి ఆనందపరిచారు. కాగా జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో మరోమారు రుజువైంది. జపాన్ లో కరోనా ప్రభావం అంతగా లేక పోవడంతో థియేటర్స్ తెరుచుకున్నాయి.
దీనితో ప్రభాస్ సాహో మూవీని జపనీస్ భాషలో డబ్ చేసి విడుదల చేశారు. సాహో మూవీ అక్కడ అత్యంత ఆదరణ దక్కించుకోవడంతో పాటు, జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో మొదటి స్థానంలో నిల్చింది. ఇప్పటివరకు అమిర్ ఖాన్ దంగల్ జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఉంది. సాహో ఆ రికార్డును అధిగమించి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఇక జపాన్ లో అత్యంత ఆదరణ దక్కించుకున్న చిత్రాల్లో ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్, ముత్తు మరియు బాహుబలి 2 చిత్రాలు ఉన్నాయి. టాప్ 5 చిత్రాలలో రెండు చిత్రాలు ప్రభాస్ వి కావడం విశేషం.
మరి ప్రభాస్ రాబోయే చిత్రాలు కూడా అక్కడ సంచలన విజయాలు నమోదు చేస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రభాస్ 21వ చిత్ర విడుదల 2022లో ఉండే అవకాశం కలదు.
Most Recommended Video
40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?