Prabhas: ప్రభాస్ ఆ ఘనతను సాధిస్తారా?

బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కిందనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పాటు విదేశాల్లో సైతం ఈ సినిమాతో ప్రభాస్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ప్రభాస్ సినిమాలకు యూట్యూబ్ లో సైతం రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రభాస్ నటించిన సాహో సినిమా నెగిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని బాలీవుడ్ లో హిట్ గా నిలిచింది. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే సలార్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ పాన్ వరల్డ్ హీరోగా సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ స్టార్ హీరోగా ప్రభాస్ నిజంగానే గుర్తింపు దక్కించుకుంటారేమో చూడాలి. ప్రతిభ ఉన్న ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే దర్శకులను ఎంచుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయ్యే వరకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని భావిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ ను దాటినట్టేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus