Prabhas: కేజీఎఫ్2 రిలీజ్ తర్వాత ప్రభాస్ నిర్ణయం మారిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ప్రస్తుతం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరమనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లోనే ఉన్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరుత్సహపరిచాయి. త్వరలో భారత్ కు రానున్న ప్రభాస్ మే 1వ తేదీ నుంచి సలార్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని బోగట్టా.

Click Here To Watch NOW

కేజీఎఫ్2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ నెలలో మాత్రం ప్రభాస్ ఏ మూవీ షూటింగ్ లలో పాల్గొనరని సమాచారం అందుతోంది. కేజీఎఫ్2 సక్సెస్ తో సలార్ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. సలార్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 మూవీ పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కినా సలార్ మూవీ మాత్రం ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

సలార్ షూటింగ్ పూర్తైన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ లలో పాల్గొననున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుందని 2024 సంవత్సరం సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం ఉంటుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus