Prabhas: రామునిపై ప్రభాస్ భక్తికి ఫిదా అవ్వాల్సిందే.. ప్రభాస్ మంచోడంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మూవీ ట్రైలర్ వ్యూస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆదిపురుష్ ప్రభాస్ కోరుకున్న విజయాన్ని అందిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా ప్రభాస్ భద్రాద్రి రాముడికి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.

ప్రభాస్ బంధువులు భద్రాచలం ఈవోను కలిసి పది లక్షల రూపాయల చెక్ అందించారు. ఆ తర్వాత ప్రభాస్ బంధువులు ఆదిపురుష్ మూవీ సక్సెస్ సాధించాలని ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రభాస్ రాముని పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ఇచ్చిన 10 లక్షల రూపాయలను ఆలయ అవసరాలు, అన్నదానం, గోదానం కోసం ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

రామునిపై ప్రభాస్ భక్తికి ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో పాటు ఇతర సినిమాలపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ కు ఇతర భాషల్లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా బడ్జెట్, మార్కెట్ ను బట్టి ప్రభాస్ పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా ప్రభాస్ జాగ్రత్త పడుతున్నారు. ఆదిపురుష్ సినిమాకు 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ పోటీ నెలకొందని సమాచారం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus