Unstoppable with NBK: ప్రభాస్, గోపిచంద్ పాల్గొన్న బాలయ్య షో థియేటర్లలో.. ఎప్పుడంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ హెస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్‌లో టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయబోతున్నాడు.. ఈ సీజన్‌లో ఇద్దరేసి గెస్టులుగా వస్తున్నారు కాబట్టి.. డార్లింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ ‘మాచో స్టార్’ గోపిచంద్‌ని కూడా పిలిచాడు.. ఆదివారం (డిసెంబర్ 11)న షూటింగ్ కావడంతో ఫ్యాన్స్ పెద్దఎత్తున వచ్చారు.. ఇక షూట్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ లీక్ అయ్యి నెెట్టింట తెగ హంగామా చేశాయి..

దీంతో తర్వాత రోజు మధ్యాహ్నం కల్లా అఫీషియల్‌గా పిక్స్ రిలీజ్ చేయాల్సి వచ్చింది.. ప్రభాస్ షర్ట్ గురించి, బాలయ్యకి, గోపికి ఇంటి నుండి బిర్యానీ చేయించి తీసుకొచ్చాడని.. అసలు బాలయ్య ఎలాంటి ప్రశ్నలడిగారు?.. పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ ఏం చెప్పాడు?.. ఫోన్‌లో రామ్ చరణ్ ఏమన్నాడు?.. ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇక లాభం లేదు అనుకుని.. మంగళవారం (డిసెంబర్ 13) రాత్రి 11:15 గంటలకు గ్లింప్స్ వదిలారు.. డార్లింగ్ ఎంట్రీ..

ఒకే ఒక్క డైలాగ్, కొన్ని హావభావాలు తప్ప ఏమీ లేదు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నా కానీ మెజారిటీ శాతం ఫ్యాన్స్, ఆడియన్స్.. గ్లింప్స్ అంటే ఇలానే ఉంటుంది.. ట్రైలర్ వస్తేనే అసలైన కిక్ వస్తోందంటున్నారు.. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతుంది.. ఇక ఇప్పుడు ఎపిసోడ్ స్ట్రీమింగ్ గురించి నెట్టింట కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్‌ని డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటలకు స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.. అప్పటికే మెల్లగా న్యూ ఇయర్ హంగామా స్టార్ట్ అవుతుంది..

జనవరి 1న అయితే చాలా వరకు ఇంకా అదే హ్యాంగోవర్‌లో ఉంటారు కాబట్టి.. ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.. ఇక క్రికెట్ మ్యాచెస్, స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాల వంటివి థియేటర్లలో చేస్తున్నారు.. మరి ఎంతో క్రేజ్.. భారీ అంచనాలతో రాబోతున్న ‘అన్ స్టాపబుల్’ షో ని కూడా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టెడ్ థియేటర్లలో ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది?.. అనే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.. దాదాపు గంటలోపే ఉండే ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకాభిమానులకు మంచి థ్రిల్ ఫీల్ కలిగించాలని టీం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus