Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ షాక్‌లు అలవాటేగా..!

గడిచిన పదేళ్ళలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)  స్థాయి ఏ రేంజ్ లో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్, టాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లో కూడా ప్రభాస్ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఆయన కెరీర్‌లో తరచూ రిపీట్ అవుతున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, సినిమా విడుదల తేదీల విషయంలో స్పష్టత లేకపోవడం. ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు ప్రతీ సారి షాక్ లు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా, నటిస్తున్న “ది రాజాసాబ్”  (The Rajasaab) సినిమా కూడా ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Prabhas

మారుతి  (Maruthi Dasari)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సినిమా మొదట డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ ఆలస్యం అవుతోందని, ప్రభాస్ గాయంతో కూడిన పరిస్థితి షూటింగ్‌ను మరింత వాయిదా వేస్తుందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించినప్పటికీ, గత అనుభవాలు చూస్తే ఈ తేదీపై అభిమానులు పెద్దగా నమ్మకం ఉంచడం లేదు.

ప్రభాస్ గత చిత్రాలు “సాహో,” (Saaho)  “ఆదిపురుష్,” (Adipurush) “సలార్,” (Salaar)   “కల్కి 2898 ఏడీ” (Kalki 2898 AD)  వంటి చిత్రాలన్నీ అనౌన్స్ చేసిన తేదీలకు రాకపోవడం తరచుగా జరిగిందే. అయితే ఈ డిలేలకు కారణం ప్రాజెక్టుల భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ వర్క్, లేదా రీషూట్లలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ. ఇదే పరిస్థితి “ది రాజాసాబ్” విషయంలో కూడా జరగుతుందా అన్న ప్రశ్నలు వేగంగా చర్చించబడుతున్నాయి. ఈ వాయిదాలు ప్రభాస్ ఇమేజ్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, ప్రేక్షకుల నిరీక్షణ సవాళ్లతో కూడినదే.

అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈ షాక్‌లను అలవాటు చేసుకున్నారు. “బాహుబలి”  (Baahubali) మొదటి భాగం ఆలస్యంగా వచ్చినా, ఆ సినిమా ప్రభాస్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. “మిర్చి” (Mirchi) – “సాహో” వంటి చిత్రాలు కూడా వాయిదా తర్వాతే విడుదలయ్యాయి. కానీ వీటి విజయాలు ఆ ఆలస్యాన్ని మర్చిపోయేలా చేశాయి. “ది రాజాసాబ్” విడుదలకు ప్రభాస్ టీం ప్రయత్నిస్తున్నా, అదే తేదీకి యష్ (Yash)”టాక్సిక్” (Toxic)  సినిమా కూడా ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus