ప్రభాస్ అభిమానులకు ఇప్పుడు స్పష్టత వచ్చింది!

ఒకప్పుడు మహేష్, పవన్ కళ్యాణ్ తమ ఫ్యాన్స్ ని సినిమాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేలా చేశేవారు. వీరి నుండి ఒక సినిమా తరువాత మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టేది. పవన్ రీ ఎంట్రీ తరువాత వరుసనే మూడు చిత్రాలు ప్రకటించగా.. మహేష్ కూడా కొన్నాళ్లుగా చకచకా సినిమాలు చేస్తున్నాడు. ఐతే ప్రభాస్ మాత్రం తన అభిమానులకు అగ్నిపరీక్ష పెడుతున్నాడు. హాలీవుడ్ హీరోల మాదిరి ఆయన నుండి సినిమా రావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. సాహో తరువాతైనా ఆయన వరుసగా సినిమాలు చేస్తాడు అనుకుంటే రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ నత్త నడకన సాగుతుంది. కొన్నాళ్ళు ఈ మూవీ షూటింగ్ పై ఎటువంటి అప్డేట్ లేదు.

Prabhas fans can relax now1

ఆ మధ్య ప్రభాస్ ఓ సెట్ లో నిల్చొని ఉన్న ఫోటో పంచుకుంటూ నూతన షెడ్యూల్ మొదలుపెట్టినట్లు చెప్పారు. నిన్న దర్శకుడు రాధా కృష్ణ మొదటిసారి ఓ క్యూట్ ఛేజింగ్ సీన్ కంప్లీట్ చేశాము, త్వరలో యూరప్ లాంగ్ షెడ్యూల్ మొదలుపెట్టాలని అప్డేట్ ఇచ్చారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంత ఊరట లభించింది. షూటింగ్ అడ్డంకులు లేకుండా జరుగుతుంది అనే నమ్మకం వారిలో కలిగింది. ఇప్పటివరకు అసలు ఏమి జరుగుతుంది? ఈ మూవీ ఎప్పుడు వస్తుంది? అన్న కన్ఫ్యూషన్ లో ఉన్న ఫ్యాన్స్ కి స్పష్టత వచ్చింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతునన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈమూవీ తెరకెక్కుతుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus