Prabhas, Gopichand: గోపీచంద్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహం ఎందుకు?

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకి టాక్ బాగానే వచ్చినా బెనిఫిట్ షోలు చూసిన జనాలు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో దానినే ఫైనల్ చేసేసారు చాలా మంది జనాలు. టాలీవుడ్ చరిత్రలో ఇది ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయం అని ట్రేడ్ పండితులు సైతం తేల్చేసారు. ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశాలు కనిపించడం లేదు.

Click Here To Watch Now

‘బాహుబలి’ క్రేజ్ తో ‘సాహో’కి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఆ సినిమా మేకర్స్ ప్రాఫిట్స్ అందుకున్నారు, హిందీ బయ్యర్స్ కూడా సేఫ్ అయ్యారు. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద డిజాస్టరే..! ఇప్పుడు ప్రభాస్ కు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. ‘ఆదిపురుష్’ ‘సలార్’ చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మారుతీ మాత్రం బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు.

కానీ అతనికి స్టార్ హీరోలని మేనేజ్ చేసిన అనుభవం లేదు. ‘బాబు బంగారం’ అవకాశాన్ని కూడా అతను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. అయినప్పటికీ ప్రభాస్ మాత్రం మారుతీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మారుతీ-గోపీచంద్ కాంబినేషన్లో రాబోయే ‘పక్కా కమర్షియల్’ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ ను గట్టిగానే దట్టించాడట మారుతీ. అల్లు అర్జున్, రవితేజ ల కోసం డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్ అది.

ఈ మూవీ కనుక హిట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ. అలాగే ప్రభాస్ తో మారుతీ చేసే సినిమా పై కూడా మంచి బజ్ ఏర్పడుతుంది. తక్కువ బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్ లో సినిమా పూర్తవుతుంది కాబట్టి.. ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus