Prabhas: ‘మేం అలిగాం.. బుంగమూతి పెట్టాం’.. అంటూ కామెంట్స్!.. అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ మీద అంతులేని ప్రేమాభిమానాలు చూపించే డైహార్డ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఆయన మీద కాస్త అలిగారు.. ‘డార్లింగ్.. మేం అలిగాం.. బుంగమూతి పెట్టాం.. నీకర్థమవుతుందా?’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అసలేం జరిగింది?.. తమ ఫేవరెట్ యాక్టర్ విషయంలో ఫ్యాన్స్ ఎందుకిలా చేస్తున్నారు?.. కొంపదీసి ప్రభాస్ పెళ్లి గురించా ఏంటి?.. అంటూ రకరకాల డౌట్స్ వస్తున్నాయి కదా..వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఆదిపురుష్’ షూట్ కంప్లీట్ చేసేశాడు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఉంది. దానితో పాటు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ – K’ కూడా ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ఇటీవల స్టార్ట్ చేసిన మారుతి సినిమాల సంగతి సరేసరి.. 2023 సంక్రాంతికి రావాల్సిన ‘ఆదిపురుష్’ వాయిదా పడింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28కి ‘సలార్’ షెడ్యూల్ అయిపోయింది. పోస్ట్ పోన్ అయిన ‘ఆదిపురుష్’ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

అనుకున్న విధంగా ఔట్ పుట్ వస్తేనే కానీ మేటర్ కొలిక్కి రాదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా 2024కి వెళ్లిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత భారీ బడ్జెట్‌తో ఇలాంటి గ్రాఫిక్సా?.. అంటూ అందరూ ఓం రౌత్‌ని టార్గెట్ చేశారు. నిప్పు మీద ఉప్పులా చిన్న సినిమా ‘హనుమాన్’ టీజర్ రౌత్ మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. సీజీతో సహా మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేయడం.. అవసరం అనుకున్న చోట రీషూట్ చేయడం తప్పనిసరి అయిపోయింది.

దీంతో కాస్త టైం పడుతుంది కాబట్టి.. లేట్ అయినా బెటర్ క్వాలిటీతో వద్దామని ‘ఆదిపురుష్’ మేకర్స్ 2024లో రిలీజ్ ప్లాన్ చేద్దామనుకుంటున్నారని సమాచారం. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్.. ‘‘బాలీవుడ్ డెబ్యూ.. హిస్టారికల్ ఫిలిం.. ఈ జనరేషన్ హీరోల్లో రాముడిగా చేస్తుంది నువ్వే.. సిల్వర్ స్క్రీన్ మీద నిన్ను శ్రీరాముడిగా చూడాలని ఆశతో, ఆసక్తితో ఉన్నాం.. నువ్వేంటి డార్లింగ్.. ఇలా విడుదల వాయిదా వేస్తూ షాక్ మీద షాక్ ఇస్తున్నావ్’’ అంటూ కాస్త ఫీల్ అయ్యి, కామెంట్స్ చేస్తున్నారు. 2024 రిలీజ్ అని వస్తున్న వార్తల గురించి టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus