ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సినిమాలలో రాధేశ్యామ్ సినిమా ఒకటి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్ గా నిలుస్తుందని కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే కథ, కథనం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రభాస్ క్రేజ్ వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లు అంతకంతకూ తగ్గాయి.
విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాగా ప్రైమ్ లో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కు ఈ సినిమా ద్వారా నష్టాలే మిగిలాయని బోగట్టా. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనుగోలు చేయగా త్వరలో ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది.
బుల్లితెరపై ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయకపోయినా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బుల్లితెరపై రాధేశ్యామ్ రికార్డులు సృష్టిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. రాధేశ్యామ్ బుల్లితెరపై ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ క్లాస్ సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని రాధేశ్యామ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది.
అయితే సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు ప్రభాస్ మార్కెట్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ప్రభాస్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!