స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ మూవీకి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తైనా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సలార్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉన్నా ఆ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుండటం గమనార్హం. తాజాగా ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మరోసారి స్పష్టమైన ప్రకటన వచ్చింది.
ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలలో భిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఆకలిని తీర్చనున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తం మూడు సినిమాలతో ఫ్యాన్స్ కు ఫీస్ట్ సిద్ధం చేస్తున్న ప్రభాస్ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉండటంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ఈ సినిమాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ బాహుబలి2 సినిమాను మించిన సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!