‘బాహుబలి’ సినిమా టాలీవుడ్‌లో ఏ మార్పులు తీసుకొచ్చింది అంటే చాలానే చెప్పొచ్చు. మన ఇండస్ట్రీ గురించి దేశం, ప్రపంచం మాట్లాడుకునేలా చేసింది. అంతేనా అంటే… మన హీరోలంతా పాన్ ఇండియా అంటూ కొత్త సినిమాలు ఓకే చేయడం మొదలెట్టారు. ఇవన్నీ ఇండస్ట్రీ వైపు నుండి. మరి ప్రభాస్ నుండి అంటే… ఎంచుకునే ప్రతి స్క్రిప్ట్ పాన్ ఇండియా రేంజిలో ఉండేలా చేసింది. ఇంకా చెప్పాలంటే సాధారణ స్క్రిప్ట్ చెప్పినా… దానిని పాన్ ఇండియా స్థాయిలో మార్చేలా చేసింది. అయితే అదే ఇప్పుడు ఇబ్బంది పెడుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
‘బాహుబలి’ రెండో పార్ట్ అవుతున్నప్పుడే ‘సాహో’ సినిమాను అంతా ఓకే చేసేశాడు ప్రభాస్. ‘బాహుబలి’తో టీజర్ కూడా వదిలాడు. నిజానికి ఈ కథ పాన్ ఇండియా సినిమా కాదు. సాధారణ అండర్ గ్రౌండ్ డాన్ కథ. అయితే ‘బాహుబలి’ తీసుకొచ్చిన ఫేమ్‌తో ఆ సినిమా కూడా పాన్ ఇండియా అయిపోయింది. దాని వల్ల సినిమాను మరీ గ్రాండ్‌గా తీయాల్సి వచ్చింది. సెట్స్, నటీనటులు, రిలీజ్, ప్రచారం ఇలా అన్నీ పాన్ ఇండియా అయిపోయాయి. సినిమా ఖర్చు కూడా అమాంతం పెరిగింది.
ప్రభాస్ ఒక్కసారిగా సూపర్ మ్యాన్ అయిపోయాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనే డౌట్ రావొచ్చు. ప్రభాస్ అంతగా హైప్ తీసుకొని ‘సాహో’ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాకు ఆశించినంత విజయం దక్కలేదు అని చెప్పొచ్చు. హైప్ అందుకోలేక దర్శకుడు సుజీత్ ఇబ్బంది పడ్డాడు. బాలీవుడ్‌లో ఆ స్టయిల్ సినిమాలు అలవాటు కాబట్టి… అక్కడ బాగానే ఆడింది అంటారు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అలాంటి పనులు చేశారు అని చెబుతుంటారు. దాని సంగతి త్వరలో తేలిపోతుంది.
అయితే ప్రభాస్ పాన్ ఇండియా పుషింగ్, బడ్జెట్ పుషింగ్ ఇంకా ఆగలేదు. ‘సలార్’ సినిమా కోసం చెబుతున్న బడ్జెట్ ఖర్చు, కొన్ని సీన్ల కోసం పదుల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ వస్తున్న ప్రచారం ఇప్పుడు ఫ్యాన్స్‌కు భయం కలిగిస్తోంది. ‘సాహో’ చూశాక కూడా ప్రభాస్ ఇలా అన్ని సినిమాలను ఒకేలా చూసి, భారీ సినిమాలు అనుకుని ఎక్కువ ఖర్చు పెట్టడం సరికాదు అంటున్నారు. మరి ప్రభాస్ టీమ్ ఈ మాటలు వింటున్నారా? చూస్తున్నారా?
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!