Prabhas: ఆ మూవీ గురించి ప్రభాస్ క్లారిటీ ఇస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ గత సినిమా సాహో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. భారీ బడ్జెట్ తో, కొత్త తరహా కథాంశంతో, ప్రేక్షకులను మెప్పించే యాక్షన్ సన్నివేశాలతో సాహో తెరకెక్కినా కథ, కథనంలో లోపాలు ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి. మరోవైపు గతేడాది, ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రేక్షకులు ప్రభాస్ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా రాధేశ్యామ్ ను ఇప్పటికే పూర్తి చేసిన ప్రభాస్ ఆదిపురుష్ ను కూడా పూర్తి చేశారు.

ఆదిపురుష్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక సినిమా కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. 2022 సంవత్సరం ఆగష్టు 11వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తో చివరి షాట్ ను పూర్తి చేశానని ప్రభాస్ తో జర్నీ సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రభాస్ తో ప్రయాణం ఇంకా ముగియలేదని ప్రభాస్ వల్ల టన్నుల కొద్దీ జ్ఞాపకాలు మిగిలాయని సీయూ డార్లింగ్ అంటూ దర్శకుడు ఓం రౌత్ ట్వీట్ చేశారు. ప్రభాస్ కు కేక్ తినిపిస్తున్న ఫోటోలను ఓం రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభాస్ ఒకవైపు సలార్ సినిమాలో నటిస్తూనే మరోవైపు ప్రాజెక్ట్ కె సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus