నాలుగు భాషల్లో ఏకకాలంలో తను నటించిన సినిమాను విడుదల చేయించిన మొదటి హీరోగా విజయ్ దేవరకొండ ఆల్రెడీ క్రెడిట్స్ తన ఖాతాలో వేసుకొన్నాడు. “డియర్ కామ్రేడ్”ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు విజయ్ పడిన కష్టం అందరు చూసే ఉంటారు. ముఖ్యంగా.. బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైద్రాబాద్ లలో మ్యూజికల్ ఈవెంట్స్ ను నిర్వహించి సినిమాని అందరికీ చేరువయ్యేలా చేశాడు. ఇప్పుడు ఇదే తరహాలో ఒకేరోజు నాలుగు భాషల్లో విడుదలవుతున్న సినిమా “సాహో”.
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిమ్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవ్వనున్న ఈ చిత్రం కోసం “డియర్ కామ్రేడ్” తరహాలో పలు ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు ప్రభాస్ & టీం. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, పూణే, హైద్రాబాద్ లలో ఈ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమా మీద భీభత్సమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.. మరి సినిమా ఆ అంచనాలను అండుకోగలుగుతుందో లేదో తెలియాలంటే ఆగస్ట్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.