Prabhas Marriage: పెళ్లి గురించి ప్రశ్న.. ప్రభాస్‌ భలే ఆన్సర్‌!

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, టాలీవుడ్‌లో ప్రభాస్‌… ఇదేం పోలిక అనుకోకండి. మేం చెబుతున్నది పెళ్లి గురించి. ఈ హీరోలు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా పెళ్లి గురించి అడిగేవారు. ఇటీవల కాలంలో సల్మాన్‌ పెళ్లి టాపిక్‌ పెద్దగా వినిపించడం లేదు. ఎందుకంటే బాలీవుడ్‌ మీడియాలో కూడా ప్రభాస్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ‘రాధేశ్యామ్‌’ ప్రమోషన్స్‌ కోసం ప్రభాస్‌ ముంబయి వెళ్తే పెళ్లి టాపిక్కే వచ్చింది. దానికి ప్రభాస్‌ ఇచ్చిన సమాధానం అదిరిపోయింది.

‘ప్రేమ విష‌యంలో ఆదిత్య లెక్క త‌ప్పు’ అనే డైలాగ్ ‘రాధేశ్యామ్‌’ కొత్త ట్రైలర్‌లో ఉంటుంది. ఈ డైలాగ్‌ను ఉపయోగించే ప్రభాస్‌ పెళ్లి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది ముంబయి మీడియా. ఓ పాత్రికేయుడు ప్రభాస్‌… మీ ప్రేమ విష‌యంలో నిజ జీవితంలో మీ లెక్క ఎన్నిసార్లు త‌ప్పింది అని అడిగారు. దానికి ప్రభాస్‌ చెప్పిన సమాధానంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఆ తర్వా ఆన్సర్‌ విని ఫిదా అయిపోయారు. ‘చాలా సార్లే లెక్క త‌ప్పింది. అందుకే నాకింకా పెళ్లి కావ‌డం లేదు అనుకుంటా’ అంటూ సమాధానమిచ్చాడు డార్లింగ్‌.

ప్రభాస్‌ లెక్క తప్పడేమేమో కానీ… టాలీవుడ్‌ మీడియా లెక్క మాత్రం చాలాసార్లు తప్పింది. ప్రతిసారి ప్రభాస్‌ పెళ్లి, ఇదిగో పెళ్లి కూతురు అంటూ ఏవేవో ఫొటోలు బయటకొచ్చేవి. కొన్ని రోజులకు అదంతా తూచ్‌, నిజం కాదు అని తేలిపోయింది. సరిగ్గా ఈ సమయంలో ప్రభాస్‌ – అనుష్క ప్రేమ అంటూ మరో టాపిక్‌ వచ్చింది. దీనిపై ఇద్దరూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మేం స్నేహితులం అని మాత్రం చెప్పేవారు. దీంతో క్లారిటీ మిస్‌ అయ్యేది. ఇక్కడ తెలియలేదు బాలీవుడ్‌లో ఏమన్నా చెబుతాడా అంటే తెలివైన సమాధానం చెప్పి తప్పించుకున్నాడు డార్లింగ్‌.

అసలు ప్రభాస్‌ పెళ్లి విషయంలో ఆయన చెప్పినట్లుగా ఏం లెక్క తప్పింది, ఎన్నిసార్లు తప్పింది అనేది ఆయనే చెప్పాలి. లేదంటే ఆయన పెదనాన్న కృష్ణంరాజు అయినా చెప్పాలి. గతంలో ‘బాహుబలి’ సమయంలో సినిమా విడుదలయ్యాక పెళ్లి అన్నారు. ఆ సినిమా వచ్చి వెళ్లిపోయింది కూడా. పెళ్లి సంగతి మాత్రం తెలియడం లేదు. ప్రభాస్‌ అయితే సినిమా సినిమా చేసుకుంటూ పోతున్నాడు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus