Prabhas, Balakrishna: ఆ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం ఇస్తాడా?

పాన్ ఇండియా స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ఎక్కువగా ఇష్టపడరనే సంగతి తెలిసిందే. అయితే అన్ స్టాపబుల్ షో నిర్వాహకుల కోరిక మేరకు బాలయ్యపై ఉన్న గౌరవంతో ప్రభాస్ ఈ షోకు హాజరయ్యారు. ప్రభాస్ ఈ షోకు హాజరైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్ లో బాలయ్య, ప్రభాస్ లను చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ప్రభాస్ నుంచి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ పెళ్లి గురించి వందల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ షో ద్వారా ప్రభాస్ పెళ్లి గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. ప్రభాస్ అనుష్క మధ్య బంధానికి సంబంధించి వైరల్ అవుతున్న పుకార్లకు సైతం ప్రభాస్ ఈ షో ద్వారా చెక్ పెడతారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. పెదనాన్న కృష్ణంరాజు మరణం వల్ల కలిగిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రభాస్ పెదనాన్న జ్ఞాపకాలను కూడా ఈ షో ద్వారా పంచుకునే ఛాన్స్ ఉంది.

మరోవైపు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్లను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ మీడియా ముందుకు రాలేదు. అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ కానుండగా ఈ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీ రేంజ్ కూడా మారే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అన్ స్టాపబుల్2 షోకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య ప్రభాస్ కు సంబంధించిన సీక్రెట్లను కూడా ఈ షో ద్వారా బయటపెడతారేమో చూడాలి. రాబోయే రోజుల్లో బాలయ్య ప్రభాస్ కాంబోలో మల్టీస్టారర్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus