Prabhas: ప్రభాస్ మొహమాటం…ఆ డైరెక్టర్ తో తిట్లు తిన్న ప్రభాస్!

తెలుగు చిత్రపరిశ్రలో దర్శక దీరుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఎక్కువగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేశారు. అయితే తాజాగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో రాజమౌళి గురించి పలు విషయాలను తెలియజేశారు. చత్రపతి సినిమాలో ఒక సన్నివేశం గురించి ప్రభాస్ మాట్లాడుతూ ఒక డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.

అయితే అక్కడ జనాలని చూసే సరికి ఒక్కసారిగా తనకు కంగారు వేసిందని అయితే రాజమౌళి దగ్గరికి వెళ్లి నేను మెల్లిగా చెప్పేస్తాను మీరే కవర్ చేసుకోండి అని చెప్పగా వెంటనే జక్కన్న షాట్ ఓకే అంటూ చెప్పేశారు.అలా ఆయన మొహమాటం కారణంగా రాజమౌళి ఎంతో మంది డైరెక్టర్ల చేత తిట్లు తినడమే కాకుండా ప్రభాస్ కూడా కళా తపస్వి విశ్వనాథ్ గారి చేత తిట్లు తిన్నానని తెలిపారు.

ఇలా ప్రభాస్ (Prabhas) ఎక్కువమంది జనాలు ఉన్న సమయంలో మొహమాటం కారణంగా డైలాగులు చెప్పేవారు కాదు తద్వారా డైరెక్టర్లు రాజమౌళి కారణంగానే ప్రభాస్ ఇలా తయారయ్యారు అంటూ ఎంతో మంది రాజమౌళిని తిట్టేవారట. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ సమయంలో విశ్వనాధ్ గారు తనని తిట్టారని ప్రభాస్ తెలిపారు. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో విశ్వనాథ్ గారు తనని దగ్గరికి పిలిచి ఇలాగైతే ఎలాగయ్యా.. ఓపెన్ గా డైలాగ్ చెప్పాలి సిగ్గుపడితే ఎలా అని తనని అన్నారని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.

ఈ విధంగా రాజమౌళి కారణంగా ప్రభాస్ ఇతర డైరెక్టర్లతో రాజమౌళిని తిట్టించడమే కాకుండా ఈయననీ కూడా రాజమౌళిగారు అలవాటు చేయడం వల్ల నువ్వు ఇలా నెమ్మదిగా డైలాగులు చెప్పడం నేర్చుకుంటున్నావు అంటూ తనని అనేవారు అంటూ ప్రభాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus