టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించే విషయంలో ముందువరసలో ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఖర్చుల లెక్కలతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తారు. కొంతమంది హీరోల హోటల్ రూమ్స్ కోసం, అసిస్టెంట్ల కోసం, క్యారవాన్ల కోసం, భోజనం ఇతర ఖర్చుల కోసం నిర్మాతలు చేసే ఖర్చు కోట్లలో ఉంటుంది. అయితే ప్రభాస్ మాత్రం రెమ్యునరేషన్ మినహా ప్రొడ్యూసర్స్ నుంచి రూపాయి కూడా తీసుకోరట.
బౌన్సర్లు, ఫుడ్, అసిస్టెంట్, మేకప్ మ్యాన్ ఫీజులు, ఇతర ఖర్చులను సైతం ప్రభాస్ భరిస్తారని నిర్మాతల శ్రేయస్సు కోసం ఆయన ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ రియల్ హీరో అని ప్రభాస్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ సినిమాలకు రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ లేకుండానే రాజాసాబ్ మూవీ షూట్ జరుగుతోందని ప్రభాస్ కాంబినేషన్ లేని సీన్లను షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ వరుసగా క్రేజీ సినిమాలలో నటిస్తూ తన సినిమాలతో నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో మూడేళ్ల పాటు ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేవని సమాచారం అందుతోంది.
ప్రభాస్ (Prabhas) సినిమాలకు ఇతర భాషల్లో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తున్నారు. ప్రభాస్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేస్తుండగా 2025లో రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.