డబ్బు ముఖ్యం కాదని స్పష్టం చేసిన ప్రభాస్!
- May 23, 2017 / 06:17 AM ISTByFilmy Focus
బాహుబలి ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఈ సమయంలో కోరినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అయితే భారీ ఆఫర్ తో ఆహ్వానిస్తున్నారు. అయినా ప్రభాస్ వారిని పక్కన పెడుతున్నారు. ఈ విషయాన్నీ ఓ నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రభాస్ ముందు ఉంచారు. కోట్లు ఇస్తామని వస్తున్నా బాలీవుడ్ నిర్మాతలను తిరస్కరించడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించగా.. అందుకు ఆయన స్పందిస్తూ.. తనకి డబ్బు కంటే కుటుంబం, స్నేహితులే ఎక్కువని నిర్మొహమాటంగా చెప్పారు.
వారితో కలిసి ఉండడానికి, పని చేయడానికి తాను ఇష్టపడుతానని స్పష్టం చేశారు. బాహుబలి తో వచ్చిన క్రేజ్ ని అలాగే కొనసాగించాలని పట్టుదలతో సాహో సినిమా చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ మిత్రులైన వంశీ, ప్రమోద్ లు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాని కూడా వంశీ, ప్రమోద్ లే నిర్మించనున్నారు. అయితే దర్శకుడు మారుతాడు. జిల్ డైరక్ట్ చేసిన రాధా కృష్ణ ప్రభాస్ ని 20 వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత బాలీవుడ్ సినిమాల గురించి ప్రభాస్ ఆలోచిస్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















