Prabhas: ప్రభాస్‌ ఐదేళ్లు వెనక్కి వెళ్లాడా.. ఏంటి సంగతి?

  • August 5, 2022 / 11:47 AM IST

ప్రభాస్‌ లుక్‌పై గత కొన్ని రోజుల నుండి చాలా రకాల కామెంట్స్‌ వినిపిస్తూ ఉన్నాయి. లావయ్యాడని, ముసలోడిలా ఉన్నాడని బాలీవుడ్‌ మీడియా అయితే ఏకి పారేస్తోంది. అయితే ప్రభాస్‌ బరువు తగ్గినా, బరువు పెరిగినా దానికి ఓ కారణం కచ్చితంగా ఉంటూ వచ్చింది. సినిమాల కోసం ఆయన తన శరీరంలో మార్పులు చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. తాజాగా మరో విషయంలో ప్రభాస్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. ఈసారి టాపిక్‌ ప్రభాస్‌ వేసుకున్న చొక్కా. అవును చొక్కానే ఇప్పుడు వైరల్‌ టాపిక్‌.

వైజయంతీ మూవీస్‌ తెరకెక్కించిన ‘సీతా రామం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆద్యంతం ఎంతో హుషారు కనిపించి ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే డైరక్ట్‌గా చూడలేకపోయాం అని బాధ పడ్డారు కానీ.. చూసినంతవరకు వావ్‌ డార్లింగ్‌ అదుర్స్‌ అని పొంగిపోయారు. అయితే ఈ క్రమంలో ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అదే ప్రభాస్‌ వేసుకున్న చొక్కా గురించి రాసింది.

‘సీతా రామం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రభాస్‌ బ్లాక్‌ కలర్‌ చొక్కా వేసుకొని వచ్చాడు. దాని మీద jazz. అనే టెక్స్ట్‌ ఉంది. మీరు కూడా ఈవెంట్‌లోనో, లేకపోతే సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలు చూసే ఉంటారు. ఆ ఫొటోల్లో ప్రభాస్‌ వేసుకున్న చొక్కా ఓ ఐదేళ్ల క్రితం వేసుకున్నాడు అని వైరల్‌ ట్వీట్‌ సారాంశం. అంతేకాదు అప్పటి ఫొటో, ఇప్పటి ఫొటోను పక్క పక్కనపెట్టి మరీ చూపిస్తున్నారు.

ప్రభాస్‌ ఎంత పాన్‌ ఇండియా హీరోగా ఎదిగినా.. ఎప్పుడూ ఒదిగి ఉంటాడు. చాలా కూల్‌గా, పెద్దగా హడావుడి లేకుండా ఉంటాడు. అందుకే అప్పటి చొక్కానే మళ్లీ వేసుకున్నాడా అనే మాట సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. అయితే ఐదేళ్ల క్రితం టీ షర్ట్‌ ఇప్పుడు మళ్లీ వేస్తాడా అనే ప్రశ్న కూడా కనిపిస్తోంది. రెండు చొక్కాలు వేరని, అప్పటి డిజైన్‌లోనే ఇప్పుడు మళ్లీ కొన్నాడు అని కొందరు అంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus