Prabhas, Manchu Vishnu: మంచు విష్ణుపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్!

‘మా’ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారు. ఓ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ పెద్దలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు మంచు విశాను. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణలను కలిసిన మంచు విష్ణు తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజుని కలిశారు. ఆయన ఇంటికి వెళ్లిన మంచు విష్ణు తన ప్రణాళికపై చర్చించారు. తనకు మద్దతు ఇవ్వాలని కృష్ణంరాజుని కోరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు.

ఇక్కడవరకు అంతా బాగానే ఉంది కానీ ఫొటో షేర్ చేస్తూ.. ”ఒరిజినల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆశీర్వాదం తీసుకున్నాను” అని క్యాప్షన్ ఇచ్చారు మంచు విష్ణు. కృష్ణంరాజుని ఒరిజినల్ రెబల్ స్టార్ అని అనడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. ఆయన ఒరిజినల్ అయితే ప్రభాస్ డూప్లికేట్ స్టారా అని ప్రశ్నిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు అని అంటే సరిపోయేదానికి ఒరిజినల్ అనే పదాన్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అటెన్షన్ కోసమే ఇలా చేసి ఉంటారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ప్రభాస్ ని పరోక్షంగా తక్కువ చేసి చూడడం కరెక్ట్ కాదని విష్ణుకి క్లాసులు పీకుతున్నారు. ఒక ట్వీట్ వేసినప్పుడు ఎవరి మనోభావాలు హర్ట్ అవ్వకుండా వేయాలని సలహాలు ఇస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణను కలిసినప్పుడు ‘ఒరిజినల్ సూపర్ స్టార్’ అని ఎందుకు పోస్ట్ పెట్టలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నీకు ఒరిజినల్ ఓటు పడదంటూ’ మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి మంచు విష్ణు ”ఒరిజినల్” ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus