Prabhas, Maruthi: ప్రభాస్ మారుతి మూవీ కథ అలా ఉండబోతుందా?

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులలో కొంతమేర అసంతృప్తి ఉన్నా మారుతి ఈ ప్రాజెక్ట్ తో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఈ సినిమా తాతామనవళ్ల కథగా తెరకెక్కనుంది.

రాజా డీలక్స్ అనే పాడుబడ్డ థియేటర్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో మనవడి పాత్రలో కనిపించనుండగా ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా తక్కువ రోజులు మాత్రమే డేట్లు కేటాయించారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. కేవలం మూడు షెడ్యూల్స్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది.

సెట్స్ లోనే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ సన్నివేశాల షూటింగ్ పూర్తి కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు నిర్మాతలు ఎవరనే సంగతి తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. 2023లో ప్రభాస్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది థియేటర్లలో విడుదల కానుండటంతో ప్రభాస్ అభిమానులకు ఆనందం కలుగుతోంది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus