Prabhas: ఆ తప్పు అస్సలు చేయొద్దు ప్రభాస్..!

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమా రిలీజ్ కానుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే దర్శకనిర్మతలు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. అయితే ఈ వార్త పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు.

రాధేశ్యామ్ దాదాపు 250 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. గతంలో పే పర్ వ్యూ పద్ధతిలో కొన్ని సినిమాలు రిలీజైనా ఆ సినిమాలు నిర్మాతలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మరోవైపు పే పర్ వ్యూ పద్ధతిలో రాధేశ్యామ్ సినిమా విడుదలైతే ఈ సినిమా పైరసీ బారిన పడే అవకాశం ఉంది. ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసి తప్పు చేయొద్దు ప్రభాస్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతుండటం గమనార్హం.

ఓటీటీలో రాధేశ్యామ్ సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంటే ప్రభాస్ భవిష్యత్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus