Prabhas: ఆ విషయంలో ప్రభాస్ జాగ్రత్త పడాల్సిందేనా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటించిన ఆ సినిమాలు వాయిదా పడటం ప్రభాస్ అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది. ప్రభాస్ నటించిన సాహో సినిమా మొదట 2019 ఆగష్టు 15వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించి చివరకు 2019 సంవత్సరం ఆగష్టు 30వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పుపై అప్పట్లో ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజవుతుందని మొదట ప్రకటన వెలువడింది. ఆ తర్వాత ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కరోనా థర్డ్ వేవ్ వల్ల ఆ సమయానికి కూడా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. 2022 సంవత్సరం మార్చి 11వ తేదీన చివరకు ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. ఆదిపురుష్ సినిమాను మొదట ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఆ తర్వాత ఈ సినిమా 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది. ఆయితే ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ మళ్లీ మారడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ సినిమాలకు రిలీజ్ డేట్లను ప్రకటించి వాయిదా వేయడం ఏమిటని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్లను ముందుగానే ప్రకటించే విషయంలో ప్రభాస్ జాగ్రత్త పడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ కు సినిమా సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus