Prabhas New House: ప్రభాస్ కొత్త విల్లా.. ఎంత ఖర్చు చేస్తున్నాడంటే?

  • December 9, 2021 / 12:51 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అతని హోదాకు తగ్గట్టుగానే దర్శకులు భారీ స్థాయిలో కథలను రెడీ చేస్తుండగా నిర్మాతలు కూడా రేంజ్ కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం అతని రెమ్యునరేషన్ 150కోట్లకు వెళ్లినట్లు టాక్ వస్తోంది. అయితే ప్రభాస్ తనకు వచ్చిన ఆదాయాన్ని రియల్ వెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఇప్పటికే ముంబైలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన డార్లింగ్ హైదరాబాద్ లో కూడా మరో విల్లాను కట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నానక్ రామ్ గుడాలో రెండు ఎకరాలను 120కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ రెండు ఎకరాల్లో ప్రభాస్ తనకు నచ్చినట్లుగా ఒక అందమైన విల్లాను నిర్మించుకొనున్నట్లు సమాచారం. ఆ ఇంటి నిర్మాణం కోసం దాదాపు 80కోట్ల వరకు ఖర్చు చేయనున్నాడట.

అంటే దాదాపు మొత్తంగా 200కోట్లతో ప్రభాడ్ కొత్త ఇంటి నిర్మాణం జరగబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తరువాత సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలతో రానున్నాడు. అలాగే మరో రెండు కొత్త కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus