సూటిగా విషయానికొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి తెలుసా? ఎందుకు తెలియదు చిన్న చిన్న షార్ట్ వీడియోస్, సరదా వీడియోలు, ప్రాంక్స్… ఇలా చాలా రకాల వీడియోలు అందులో ఉంటాయి. అలాంటివి ఇంకొన్ని సర్వీసులు కూడా ఉన్నాయి అని చెప్పేస్తారు మీరు. కానీ ఓ అగ్రహీరోకి అవేంటో తెలియదట. అంతేకాదు, వాటి పేరెత్తితేనే అమ్మబాబోయ్ అంటున్నాడట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ. ఇదంతా ఇటీవల జరిగిందే అని టాక్.
పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిన ఓ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ఫుల్ స్వింగ్‌లో నిర్వహిస్తోంది. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న సినిమా కావడం, పెద్ద పెద్ద నటులు నటిస్తుండటంతో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముందుగా చెప్పినట్లు పాన్ ఇండియా రిలీజ్ ఉండటంతో అన్ని భాషల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ హీరోగారు ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో ఇబ్బంది పడ్డారట.
వరుస ప్రెస్మీట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ఆ స్టార్ హీరో ఇటీవల ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ టీవీ యాంకర్ వచ్చి… ‘సర్ మీతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలని ఉంది… ఓకేనా’ అని అడిగిందట. దాంతో ఆ హీరో ‘అదేంటి?’ అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారట. దీంతో ఒక్కసారి ఆ యాంకర్ కంగుతిందట. విషయం తెలుసుకున్న ఆ హీరో పీఆర్ టీమ్ అలర్ట్ అయ్యి… ఇన్‌స్టా రీల్స్ అంటే ఏంటో వివరించారట. దాంతో ‘బాబోయ్ అవా.. నా వల్ల కాదు’ అంటూ జారుకున్నారట.
ప్రస్తుతం టాలీవుడ్లో, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతోంది. అంతటి హీరో అయి ఉండి, ఇన్‌స్టా రీల్స్ గురించి తెలియకపోవడం ఏంటి అని అనుకుంటున్నారు. అలా అని ఆ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో లేరా అంటే… భారీ సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. మరి అలాంటి హీరో కావాలనే రీల్స్ గురించి అలా అన్నాడా? లేక నిజంగానే వాటి గురించి తెలియదా అంటే ఏమో మరి.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!