పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడిచేస్తుంది. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్ భోజనం ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈయన భోజనం పెట్టారు అంటే తినలేక పక్కన వారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అని ఎంతో మంది ఇదివరకే ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి తెలియజేశారు.
ప్రభాస్ దగ్గర పొరపాటున కూడా మాకు ఇది ఇష్టమని చెబితే ఆయన భోజనం పెట్టి చంపేస్తారంటూ ఇదివరకు నటుడు పృథ్వి కూడా ఈయన ఇచ్చినటువంటి ఆతిథ్యం గురించి కామెంట్లు చేయడం విశేషం ఇలా ప్రభాస్ భోజనం చేశారు అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన టేబుల్ మీద ఉండాలని కోరుకుంటారు. అందులో ఆయన ఏది తింటారు ఏది లేదు అనేది తెలియదు కానీ ఆయన అడిగింది అక్కడ ఉండాలని అందుకే ఈయన భోజనం అంటే ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయని ఎంతో మంది సెలబ్రిటీలు చెప్పారు.
ఇకపోతే తాజాగా ప్రభాస్ భోజనం ఖర్చు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఒక్కడే భోజనం చేయడం చాలా అరుదట ఈయన భోజనం చేస్తున్నారో అంటే పక్కన ఓ పదిమంది దాకా ఉండాలని ఇక సినిమా షూటింగ్లో అయితే వందల మందికి స్వయంగా భోజనం తెప్పిస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఈయన ఒకరోజు రాత్రి భోజనం చేయడానికి లక్షల్లో ఖర్చు చేస్తారంటూ వార్త వైరల్ గా మారింది.
ప్రభాస్ ఒక రోజు రాత్రి భోజనం చేయాలి అంటే సుమారు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారట. ఈయన తనకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా తనతో పాటు భోజనం చేసేవారి ఇష్ట ఇష్టాలను కూడా తెలుసుకొని భోజనం తయారు చేయిస్తారని ఇలా ఒక్క పూట భోజనం కోసమే సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు ఖర్చు చేస్తారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.