Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త ఇదే!

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తక్కువ సినిమాలే తెరకెక్కించినా ఆ సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు విజయాలను అందుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు దర్శకుడిగా నాగ్ అశ్విన్ రేంజ్ ను పెంచాయి. ఈ రెండు సినిమాల విజయాలతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా మరికొన్ని నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం.

ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తుండగా కొత్త తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమా 2024 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే ఏడాదికి పైగా సమయం కేటాయించాల్సి ఉంటుందని బోగట్టా. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని సమాచారం అందుతోంది.

భారీ హంగులతో దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచేలా ఈ సినిమా ఉంటుందని బోగట్టా. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నాగ్ అశ్విన్ రెండేళ్లకు పైగా సమయం కేటాయించారు. తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ఈ దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు తన వంతు సహాయసహకారాలు అందించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus