Project K: ‘ప్రాజెక్ట్‌ K’ విషయంలో నాగీ కీలక నిర్ణయం.. నిజమైతే!

పెద్ద సినిమా అనగానే ఒక భాగమే కదా.. అనే ప్రశ్న వినిపిస్తోంది. కారణాలేమైనా కావొచ్చు.. రెండు పార్టులుగా సినిమాను తీసుకురావాలని టీమ్‌ డీఫాల్ట్‌గా ఆలోచిస్తోంది అనిపిస్తోంది. ఇలా అనుకోవడానికి మరో కారణంగా మారింది ‘ప్రాజెక్ట్‌ కె’. అవును ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వైజయంతి మూవీస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదే ఈ భారీ సినిమాను రెండు ముక్కలు చేస్తున్నారని.

టైమ్‌ ట్రావెల్‌, ఫ్యూచర్‌ టెక్నాలజీ, సూపర్‌ హీరోస్‌.. ఇలా చాలా కాన్సెప్ట్‌ల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. ఇందులో ప్రభాస్‌, దీపిక పడుకొణె, అమితాబ్‌ బచ్చన్‌.. ఇలా అగ్ర తారలు చాలామంది నటిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఒక భాగం అని మొదలుపెట్టినా.. ఇప్పుడు చూస్తుంటే రెండు భాగాలు చేస్తే బాగుంటుంది అని టీమ్‌ భావిస్తోందట. ఈ క్రమంలో సినిమాను రెండు ముక్కలు చేసి విడుదల చేయాలని చూస్తున్నార. ఈ మేరకు క్విక్‌గా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు.

అయితే ‘ప్రాజెక్ట్‌ కె’ రెండు ముక్కలు అవుతోంది అనే విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కథ పరిధి చాలా పెద్దగా ఉండటంతో ఒకే సినిమాలో మొత్తం విషయాలను ఇమడ్చడం కష్టంగా మారిందని.. అందుకే సినిమాను రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రభాస్‌ను పాన్‌ ఇండియా హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమాను కూడా ఇలానే ఒక పార్ట్‌ అనుకున్నారు.

అయితే ఆ తర్వాత ఆలోచన మారి రెండు భాగాలు అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే అంటున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ తొలి భాగానికి సంబంధించి దాదాపు షూటింగ్‌ పూర్తి అయిపోయిందట. దీంతో వీలైనంత త్వరగా మొదటి ‘కె’ని విడుదల చేసి.. ఆ తర్వాత రెండో ‘కె’ పని పడతారు అంటున్నారు. అయితే తొలి పార్ట్‌ రావాలన్నా 2024 అవుతుందని సమాచారం. 2025లో రెండో పార్టు వస్తుంది అంటున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus