‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ‘రాధేశ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ సినిమా కూడా ఉంది. ముందుగా ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. నిజానికి పాన్ ఇండియా సినిమాలంటే ఆలస్యం కావడం సాధారణ విషయమే. కానీ ‘రాధేశ్యామ్’ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా సినిమా చెప్పిన టైమ్ కి వచ్చేలా లేదు.
జూలైలో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు దసరాకైనా రిలీజ్ అవుతుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘రాధేశ్యామ్’కి మరో కష్టం వచ్చి పడింది. ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు సకాలంలో జరగడం లేదని సమాచారం. ఎనభైల నేపథ్యంలో సాగే కథ కావడంతో.. దానికి తగ్గట్లుగా కొన్ని సెట్స్ వేశారు. అయితే సీజీపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. సీజీ పనులు చాలా కంపెనీల చేతుల్లో పెట్టారు. ఒకే కంపెనీకి అన్ని పనులు ఇస్తే ఆలస్యం అవుతుందని.. నాలుగైదు కంపెనీల మీద ఆధారపడ్డారు.
కానీ ఇప్పుడు అవేవీ కూడా సరిగ్గా వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. అనుకున్న సమయానికి వీఎఫ్ఎక్స్ పూర్తి కావడం కష్టమని.. ఆయా కంపెనీలు చిత్రబృందానికి చెప్పేశాయట. అందుకే ఇప్పుడు ‘రాధేశ్యామ్’ టీమ్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతోంది. వరల్డ్ మొత్తం కోవిడ్ తో ఇబ్బంది పడుతుండడంతో.. ఎవరూ ఆఫీసులకు రావడం లేదు. వర్క్ ఫ్రమ్ పద్ధతి చాలా దేశాల్లో నడుస్తోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులన్నీ విదేశీ సంస్థలకు అప్పగించడంతో అక్కడి పరిస్థితుల కారణంగా పనులన్నీ ఆలస్యమవుతున్నాయి!
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!