Radheshyam Teaser: ‘నేను దేవుడిని కాదు.. మీలో ఒక్కడిని కూడా కాదు’..

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ స్పెషాలిటీ ఏంటంటే.. డైలాగ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లోనే ఉండడం.

సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ అనే క్యారెక్టర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఎలా ఉండబోతుందో టీజర్ ద్వారా తెలియజేశారు. ఇందులో ప్రభాస్ పామిస్ట్ (చేయి చూసి జాతకం చెప్పేవారు)గా కనిపించనున్నారు. ‘ఐ నో యు… బట్ నో.. ఐ వోంట్ టెల్ యు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ‘ఐ కెన్ ఫీల్ యువర్ హార్ట్ బ్రేక్.. బట్ ఐ వోంట్ టెల్ యు..’, ‘ఐ కెన్ సీ యువర్ ఫెయిల్యూర్స్.. బట్ ఐ వోంట్ టెల్ యు’ ఇలా తనకు అన్నీ తనకు తెలుసనీ కానీ ఏవీ చెప్పనని అంటున్నాడు విక్రమాదిత్య. ‘నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు.. మీలో ఒక్కడిని కూడా కాదు’ అంటూ ఇంగ్లీష్ లో చెప్పే డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.

టీజర్ మొత్తం ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ మల్టీ లాంగ్వేజెస్‌లో సబ్‌ టైటిల్స్‌ తో విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా పలు భాషల్లో జనవరి 14న విడుదల చేయనున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus