Prabhas: ట్రైలర్ చూస్తున్నంత సేపు నవ్వాపుకోలేకపోయాను: ప్రభాస్

మహేష్ బాబు పి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించినటువంటి తాజా చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..

ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆద్యంతం సంతోషానికి గురిచేస్తుంది ఈ క్రమంలోనే అనుష్క నటించినటువంటి ఈ సినిమా ట్రైలర్ పై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు.అనుష్క ప్రభాస్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఎంతో ప్రాణ స్నేహితులు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి.

ఇక ఈ సినిమాని నిర్మించింది స్వయానా (Prabhas) ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ కావడం విశేషం. ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్ ఈ ట్రైలర్ చూసిన అనంతరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ట్రైలర్ చూసినంతసేపు నవ్వు ఆపుకోలేక పోయాను.

స్వీటీ అండ్ నవీన్ మీరిద్దరూ ఎంతో అద్భుతంగా చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్నటువంటిఈ సినిమా కోసం చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ వీడియో పై స్పందించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాహుబలి సినిమా తర్వాత అనుష్క కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు అయితే చాలా రోజుల తర్వాత ఈమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus