Prabhas, Gopichand: ప్రభాస్ కోసం ఆ హీరో వాడిన షర్ట్.. ఇదెక్కడి వాడకం సామీ!

డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మారుతి (Maruthi Dasari)  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్‌తో కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన స్టిల్‌లో ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్‌లో చెక్స్ ఉన్న స్టైలిష్ షర్ట్‌లో ప్రభాస్ దర్శనమిచ్చాడు.

Prabhas, Gopichand

అయితే ఈ షర్ట్ విశ్వం (Viswam) సినిమాలో గోపీచంద్ (Gopichand) కూడా వేసుకున్నాడు. దీంతో ఒకే తరహా షర్ట్‌ను రెండు సినిమాల్లో ఇద్దరు హీరోలు వాడడం చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. రెండు షర్ట్స్‌లో ఒక్క జేబు తప్ప మరేమీ తేడా లేదని ఫోటోలతో పోల్చి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. రెండు సినిమాలకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కావడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. డబ్బులు ఆదా చేస్తున్నారని కొందరు అంటుంటే..

సరదాగా , కాస్ట్యూమ్స్‌ను రీసైకిల్ చేసుకోవడం సాధారణమని మరికొందరు అభిప్రాయపడ్డారు.ప్రభాస్ (Prabhas) , గోపీచంద్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. అలాగే ఒకే రేంజ్ పర్సనాలిటీతో ఉండటంతో డైరెక్టర్ ఇదే షర్ట్‌ను ప్రభాస్‌కి కూడా పెట్టించడం గమనార్హం. టాలీవుడ్‌లో హీరోలు వాడిన కాస్ట్యూమ్స్ మళ్లీ వేరే సినిమాల్లో ఉపయోగించడం పెద్ద విశేషం కాదు, కానీ దీనిని ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.

ఇదే సందర్భంలో ఫ్యాన్స్ స్పందిస్తూ ఇందులో తప్పేమి లేదని, రెండు షర్ట్‌లతో ఇంత ట్రోలింగ్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్స్ అభిప్రాయ ప్రకారం, ఇది కేవలం కాస్ట్యూమ్ ఆర్ట్‌లో భాగమేనని, దీనిపై హైప్ అవసరం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ‘విశ్వం’ మూవీ ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది, అలాగే ‘ది రాజాసాబ్’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిక్కుల్లో పడ్డ ‘కంగువా’ నిర్మాత.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus