టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. వరుసగా రెండు సినిమాలతో 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. ప్రభాస్ మూవీ 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైతే మెజారిటీ థియేటర్లు ఈ సినిమాకే కేటాయించే అవకాశం ఉంది.
మరో స్టార్ హీరో ప్రభాస్ ఫస్ట్ క్రష్ కు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. ఒక సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. సాధారణంగా ప్రభాస్ క్రష్ అంటే చాలామంది హీరోయిన్ అనుష్క (Anushka Shetty) అని భావిస్తారు. అయితే ప్రభాస్ ఫస్ట్ క్రష్ మాత్రం స్కూల్ టీచర్ కావడం గమనార్హం. నేను చెన్నైలో చదువుకున్నానని అక్కడి స్కూల్ టీచర్ నా ఫస్ట్ క్రష్ అని ప్రభాస్ వెల్లడించారు.
ఆ టీచర్ చాలా అందంగా ఉండేవారని అయితే ఆ టీచర్ పేరు మాత్రం నాకు గుర్తు లేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ క్రష్ గురించి చెప్పిన విషయాలు తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభాస్ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయడానికి 3 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది.
ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. మైథలాజికల్ రోల్స్ లో సైతం నటిస్తూ ప్రభాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రభాస్ లుక్స్ పరంగా కూడా ఆకట్టుకుంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.