మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ తారాగణం, మైథలాజికల్ కథనంతో ఈ ప్రాజెక్ట్ తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, సినిమాలో ప్రభాస్ (Prabhas) కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే మోహన్‌లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఫస్ట్ లుక్స్ విడుదల కాగా, ప్రభాస్ పాత్రపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ లీక్ అయ్యింది.
ప్రభాస్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ ను గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాట డివోషనల్ సాంగ్ అని సమాచారం. భక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ పాట ప్రభాస్ ఎంట్రీ సీన్ అని ప్రచారం. ఇందుకు సంబంధించిన వివరాలు కమెడియన్ ఆది ద్వారా లీక్ అవడం విశేషం.
ఈ పాటకు శివ తాండవం నేపథ్యం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీంతో, ఈ పాటలో ప్రభాస్ శిఉడిని ఆరాధిస్తూ తాండవం చేస్తారేమో అన్న ఆసక్తి పెరిగిపోయింది. సినిమాలో ప్రభాస్ పాత్రపై పూర్తి స్పష్టత రానప్పటికీ, ఈ అప్‌డేట్ ఆయన పాత్రపై అంచనాలను రెట్టింపు చేసింది. మరోవైపు, మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ప్రేమతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పాత్రను సరైన సమయంలో రివీల్ చేస్తానని ఆయన గతంలో ఒక సందర్భంలో తెలిపారు.
ఇక ‘కన్నప్ప’ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాస్ పాత్రతో పాటు, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా మారనుంది. భారీ కథనం, విశేషమైన నటీనటులు, గ్రాండ్ మేకింగ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభవంలోకి తీసుకెళ్లనుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.