Prabhas: కామెడీ దర్శకుడితో ప్రభాస్..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ అలాగే ప్రాజెక్ట్ K , స్పిరిట్ వంటి డిఫరెంట్ సినిమాలని ప్రేక్షకులకు ముందుకు తీసుకు రానున్నాడు. రాధేశ్యామ్ అడ్వెంచర్ లవ్ స్టొరీ కాగా సలార్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రానుంది. ఇక రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఆది పురుష్ రానుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ K సైన్స్ ఫిక్షన్ ఫ్యూచర్ ఫిల్మ్ గా రానుంది. దేనికదే విభిన్నంగా ఉండేలా ప్రభాస్ చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులని లైన్ లో పెట్టాడు. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించలేదు. ఇక ఇటీవల ప్రభాస్ టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ మారుతితో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా షూటింగ్ చాలా వేగంగా ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సినిమా హార్రర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక టైటిల్ గా ‘రాజా డీలక్స్’ అని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. డివివి.దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మారుతి గతంలో చాలా విభిన్నమైన కామెడీ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఏ విధంగా ఆకట్టుకుంటాడు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం మారుతి గోపిచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం సమ్మర్ తరువాత ప్రభాస్ సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని ప్లాన్ చేటున్నారు. డివివి.దానయ్య ఆ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ హారర్ కామెడీ లో ఎలా దర్శనమిస్తాడో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus