ప్రభాస్ (Prabhas) , సందీప్ వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘యానిమల్’తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit) ప్రాజెక్టును మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ టాక్ ప్రకారం, ప్రభాస్ మామూలుగా ఊహించని రేంజ్‌లో కఠినమైన షూటింగ్ షెడ్యూల్‌ను ఎదుర్కోబోతున్నాడట. రాజమౌళి (S. S. Rajamouli) సినిమాల్లో హీరోలు ఎంత శ్రమిస్తారో తెలిసిందే. ఇప్పుడు వంగా కూడా అదే పద్ధతిలో తన పని తాను తీసుకునేలా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా కోసం వంగా ప్రభాస్‌కు కొన్ని స్ట్రిక్ట్ షరతులు విధించినట్లు టాక్. షూటింగ్ ఆలస్యం కాకుండా జూన్ నుంచే రెగ్యులర్‌గా స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారట. అంతేకాదు, 65 రోజులపాటు బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేసుకున్నారట. బాహుబలి (Baahubali) తర్వాత ఏ దర్శకుడు ప్రభాస్‌ను ఇలా నాన్‌స్టాప్‌గా పని చేయించలేదు.
అందుకే, ప్రభాస్ ఈ షరతులను ఒప్పుకుంటారా లేక వాటిని సాఫ్ట్‌గా మార్చుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రభాస్ ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండానే చేయాలని వంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా టాలీవుడ్‌లో హీరోలు బాడీ డబుల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వంగా మాత్రం ప్రతి సన్నివేశంలో ప్రభాస్ స్వయంగా యాక్షన్ పార్ట్ చేయాలని కోరాడట.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు ఇది కొంత కష్టతరమే అయినా, ‘స్పిరిట్’కు మరో లెవెల్‌ను తీసుకురావడానికి ఆయన కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ (The Rajasaab) షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా కూడా లైన్‌లో ఉంది. కానీ వంగా మాత్రం ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేయకుండా నాన్‌స్టాప్‌గా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు.